Tuesday, September 26, 2023

Chandrababu Quash Petition : చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

Chandrababu Quash Petition : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం రెండు రోజుల తర్వాత తీర్పు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి, రంజిత్ రెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున సిద్థార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు… తీర్పును రిజర్వ్ చేసింది.

Source link

Latest news
Related news