TDP Mps Vs Ysrcp Mps : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై లోక్ సభలో టీడీపీ, వైసీపీ ఎంపీ మధ్య వాగ్వాదం జరిగింది. చంద్రబాబు అరెస్టు విషయాన్ని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ ప్రస్తావించారు. దీనిని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తప్పుబట్టారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుని ఉద్దేశిస్తూ…కూర్చోరా, కూర్చోరా బాబు అంటూ హేళనగా మాట్లాడారు ఎంపీ మిథున్ రెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డి అనుంచిత వ్యాఖ్యలను, ఎంపీ రామ్మోహన్ నాయుడుపై నోరు పారేసుకున్న విధానాన్ని టీడీపీ ఎంపీలు ఖండించారు. సహచర ఎంపీ అన్న కనీస గౌరవ మర్యాదలు లేకుండా రామ్మోహన్ నాయుడుని ఏకవచనంతో మిథున్ రెడ్డి మాట్లాడడంపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడుపై మిథున్ రెడ్డి వ్యాఖ్యలను పలువురు సీనియర్ ఎంపీలు తప్పుబట్టారు. పార్లమెంట్ లో మిథున్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు హస్తం ఉందని చెప్పిన మిథున్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
BREAKING NEWS