AP Governor : ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి నుంచి గవర్నర్ కు కడుపులో నొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. గవర్నర్ కు వైద్య పరీక్షలు చేసి రోబోటిక్ విధానంలో సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్‌కు కడుపులో నొప్పి రావడంతో సోమవారం ఉదయం రాజ్ భవన్ వెళ్లిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో ఆయనను మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో మణిపాల్ ఆస్పత్రిలో తరలించారు. గవర్నర్ కు శస్త్ర చికిత్స చేసినట్లు, రేపు డిశ్చార్జి చేస్తామని మణిపాల్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
BREAKING NEWS