Leopards released: తిరుమల నడక మార్గానికి సమీపంలో సంచరిస్తూ భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుతల్లో నాలుగింటిని బోనుల్లో బంధించారు. వాటిలో రెండు చిరుతల్ని చిన్నారిపై దాడి చేసినవి కాదని వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. ఒక చిరుతకు పూర్తిగా దాడి చేసి చంపే స్థాయిలో దంతాలు ఎదగకపోవడం, మరొకటి నెలల కూనగా గుర్తించారు. దీంతో పాటు చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షల్లో వాటి ప్రమేయం లేదని నిర్ధారణ కావడంతో రెండు చిరుతల్ని విడిచిపెట్టినట్టు డిఎఫ్‌ఓ వెల్లడించారు.
BREAKING NEWS