AP CID On Chandrababu : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన సూత్రధారి అని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. దిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వివరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం జరిగిందని, ఇందులో రూ.371 కోట్లు దారిమళ్లించారని తెలిపారు. ఈ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ దర్యాప్తు తేలిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెప్పిందన్నారు. టీడీపీ ప్రభుత్వం పక్కా ప్లాన్ తోనే నిధులు మళ్లించినట్లు సీఐడీ చీఫ్ అభియోగించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందన్నారు. ఈ స్కామ్ లో ఏ-1 నిందితుడిగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేశామని, ఆయనకు కోర్టు రిమాండ్ విధించిందని పేర్కొన్నారు.
BREAKING NEWS