Tuesday, October 3, 2023

Couple Murder : అనంతపురంలో దారుణం.. నిద్రిస్తున్న దంపతుల హత్య, నిందితుడిని రాళ్లతో కొట్టి చంపిన స్థానికులు..!

ప్రాథమిక వివరాల ప్రకారం… యాడికి మండలం నిట్టూరులో సోమ్మక్క(47), బాలరాజు(53) దంపతులు నిన్న రాత్రి వారి ఇంటి ముందు నిద్రపోయారు. ఈ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్(35)​ అనే వ్యక్తి దంపతులపై కొడవలితో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. వారి పక్కనే నిద్రిస్తున్న కుమార్తెను కూడా హత్య చేయాలని భావించాడు. ఇంతలోనే ఆమె తేరుకోవటంతో… కేకలు వేసింది. అరుపులు విన్న స్థానికులు హత్యకు దిగిన వ్యక్తిని పట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రసాద్ పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో అతడు కూడా చనిపోయాడు. అయితే హంతకుడు ప్రసాద్​కు మతిస్థిమితం లేదని తెలుస్తోంది.

Source link

Latest news
Related news