కొట్టి, చంపేస్తానని బెదిరించి..
26 ఏళ్ల గర్భిణి పై అదే ఇంట్లో ఉండే మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను కొట్టి, బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘాతుకాన్ని ఆ యువతి తన భర్తకు చెప్పుకుంది. కానీ, ఆ భర్త మరింత అన్యాయంగా వ్యవహరించాడు. ఆ యువతిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. పైగా ‘నా తండ్రి బలవంతంగానైనా సరే నీతో సంబంధం పెట్టుకున్నాడు కనుక. ఇక నుంచి నువ్వు ఆయన భార్యవు. ఇక నువ్వు నాకు తల్లి వరుస అవుతావు. మన మధ్య భార్యాభర్తల సంబంధం ఇక ఉండదు’ అని ఆ బాధితురాలిని ఇంట్లో నుంచి పంపించేశాడు. దాంతో, ఆ యువతి తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. అనంతరం, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి, పోలీసు కేసు పెట్టింది.