“కలిసికట్టుగా పోరాడాలనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయం. ఇరు పార్టీల చర్చల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రజల తరఫున పోరాడుతున్న తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయినా లోకేశ్‌ను జైలుకు పంపిస్తామని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. ప్రజల కోసం పోరాడుతున్నందుకే చంద్రబాబును జైల్లో పెట్టారు. అందుకే కలిసికట్టుగా పోరాడుతామని పవన్ కల్యాణ్ జైలు వద్దే ప్రకటించారు. పవన్ కల్యాణ్ లాంటి నాయకుడిని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారంటే సామాన్యుడు తిరిగే పరిస్థితి ఉంటుందా?’’ అని లోకేశ్ ప్రశ్నించారు.
BREAKING NEWS