Thursday, September 21, 2023

RGV On TDP : చంద్రబాబు అరెస్టును కేర్ చేయని జూ.ఎన్టీఆర్, ఇక టీడీపీకి దబిడి దిబిడే – ఆర్జీవీ సెటైర్లు

RGV On TDP : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై వైసీపీ సానుభూతిపరుడు, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై జూ.ఎన్టీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ విషయంపై ఆర్జీవీ ఉపయోగించుకుని చంద్రబాబుపై సెటైర్లు వేశారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ… ఇటీవల కాలంలో టీడీపీ, జనసేన లక్ష్యంగా సినిమాలు, ట్వీట్లు చేస్తున్నారు. ఘటన ఏదైనా సరే ట్విట్లర్లో ఎంట్రీ ఇచ్చి టీడీపీ, జనసేనపై సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు అరెస్టు, పవన్ ను పోలీసులు అడ్డుకోవడంపై విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై జూ.ఎన్టీఆర్ స్పందించకపోవడం చూస్తుంటే… టీడీపీ భవిష్యత్తు దబిడి దిబిడే అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్ పై టీడీపీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే… ఈ వివాదంపై జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆచీతూచి స్పందిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై నందమూరి కుటుంబంతో పాటు, నిర్మాతలు అశ్వినీదత్, నట్టికుమార్, కె.రాఘవేంద్రరావు స్పందించారు. అయితే ఈ ఘటనపై జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ స్పందించకపోవడం గమనార్హం.

Source link

Latest news
Related news