ఏపీ ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్
- సెప్టెంబర్ 14 నుంచి 15 వరకు – ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్
- సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు – ఆన్‌లైన్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికెట్లు అప్ లోడ్
- సెప్టెంబర్ 14 నుంచి 17 వరకు – వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
- సెప్టెంబర్ 17 – వెబ్ ఆప్షన్లలో మార్పుచేర్పులు
- సెప్టెంబర్ 21 – అభ్యర్థులకు సీట్ల కేటాయింపు
- సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు – ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్, సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్
AP EAPCET 2023 కౌన్సెలింగ్ కు దరఖాస్తు ఇలా
- eapcet-sche.aptonline.inలో AP EAPCET అధికారిక వెబ్ సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో ఉన్న AP EAMCET 2023 కౌన్సెలింగ్ లింక్‌పై క్లిక్ చేయండి.
- ముందుగా అభ్యర్థి రిజిస్టర్ చేసుకోని, సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- తర్వాత లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
- ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సబ్మిట్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేయండి.
కౌన్సెలింగ్ కు అవసరమయ్యే సరిఫ్టికెట్లు
ఏపీ ఈఏపీసెట్ 2023 తుది విడత కౌన్సెలింగ్ కు ఈఏపీసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, 2020 జనవరి 1 లేదా ఆ తర్వాత జారీ చేసిన ఇన్ కమ్ సర్టిఫికేట్ లేదా తెల్ల రేషన్ కార్డు తీసుకురావాలి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తహసీల్దార్ జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ ఇన్‌కమ్ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్, అభ్యర్థికి ఇన్‌స్టిట్యూషల్ ఎడ్యుకేషన్ లేనిపక్షంలో 7 సంవత్సరాల కాలానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎంప్లాయర్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.