Nara Lokesh : టీడీపీ అధినేత చంద్రబాబు జోలికి వచ్చిన సీఎం జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా మూల్యం చెల్లించక తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఎన్నిసార్లు తమను జైలుకు పంపినా పోరాటం ఆగదన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని, ఎవరిని వదిలిపెట్టమని లోకేశ్ హెచ్చరించారు. రాజమండ్రిలో లోకేశ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజలంతా స్వచ్ఛందంగా ఖండించారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని, స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి అనేది ఒక ఆరోపణ మాత్రమే అన్నారు. సీఐడీ కక్ష సాధింపు డిపార్ట్‌మెంట్ గా మారిందన్నారు. చంద్రబాబుపై అవినీతి మరక వేసేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజలు, రాష్ట్రం, దేశం కోసం అహర్నిశలు పనిచేశారన్నారు. అవినీతి అనేది చంద్రబాబు రక్తంలోనే లేదన్నారు. చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేసి, దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారని లోకేశ్ ఆవేదన చెందారు.
BREAKING NEWS