CM Jagan Review : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలు, రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఉన్నతాధికారులు, పార్టీ ముఖ్యనేతలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చంద్రబాబు అరెస్టు చేసే క్రమంలో జరిగిన పరిణామాలను అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో జరగిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
BREAKING NEWS