రిజిస్ట్రేషన్..
ఆయుష్ నీట్ పీజీ 2023 పరీక్ష రాసిన విద్యార్థులు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి aaccc.gov.in. వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 2 వ తేదీ. అక్టోబర్ 3, అక్టోబర్ 4 తేదీల్లో సీట్స్ అలాట్మెంట్ ప్రక్రియ ఉంటుంది. ఏ విద్యార్థికి ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో అక్టోబర్ 5వ తేదీన ప్రకటిస్తారు. అక్టోబర్ 6 వ తేదీ నుంచి అక్టోబర్ 13 తేదీ మధ్య విద్యార్థులు తమకు అలాట్ చేసిన కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆయుష్ నీట్ పీజీ 2023 అడ్మిషన్లకు మొత్తం 4 రౌండ్లలో కౌన్సెలింగ్ జరుగుతుంది. మూడు రౌండ్ల కౌన్సెలింగ్ అనంతరం, మిగిలిన సీట్లకు స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ ఉంటుంది.