ఫ్లెక్సీల వార్
చంద్రబాబు అరెస్టుపై టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. వైసీపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నాయి. మంత్రి రోజా చంద్రబాబుకు రిమాండ్ విధించిన వెంటనే తన ఇంటి వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. వైసీపీ తీరును టీడీపీ తప్పుబడుతోంది. అయితే కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు అరెస్టుతో ఎన్టీఆర్ ఆత్మశాంతించిందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, హరికృష్ణ, తారకరత్న మరణాలను వాడుకుని చంద్రబాబు రాజకీయాలు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన రోజు సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ ఆత్మశాంతి రోజు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఇందులో హరికృష్ణ, జూ.ఎన్టీఆర్ సీఎం జగన్ కు పుష్పగుచ్ఛం ఇస్తున్నట్లు ఫొటో పెట్టారు. అయితే జగ్గయ్యపేటలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఫ్లెక్సీ పెట్టారు. ఇందులో బాబాయ్ ను హత్యచేసింది ఎవరు? అమ్మను, చెల్లిని పార్టీ నుంచి తరిమేసింది ఎవరు? ఈడీ, సీబీఐ కేసులోల్ ఏ1 ఎవరు? అంటూ సీఎం జగన్ ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.