2 వేల మంది నేరగాళ్లను దింపారు
సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో చట్టాలు సరిగ్గా ఉంటే బెయిల్ వచ్చిన వ్యక్తి సీఎం అయ్యేవాడేకారన్నారు. రెండేళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి, దేశంలోనే ధనిక సీఎం జగన్… రాష్ట్రం కోసం ఏం చేశారో తెలియదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాను పీఏసీ మీటింగ్ కోసం వస్తే చంద్రబాబును కలిసేందుకు వస్తానని ప్రచారం చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించింది వైసీపీ నేతలే అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజకీయాలు ప్రశాంతంగా ఉంటాయని ఎప్పుడూ అనుకోవద్దన్నారు. కోనసీమ జిల్లాల్లో వారాహి యాత్రపై దాడి చేసేందుకు 2 వేల మంది నేరగాళ్లను దించారని, 50 మందిని చంపేయాలని ప్లాన్ వేశారన్నారు. వైసీపీ కుట్ర తెలిసి కేంద్ర పెద్దలు దానిని అడ్డుకున్నారన్నారు. తణుకు, భీమవరంలో వారాహి యాత్రపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. చట్టాలు సరిగా పనిచేస్తే బెయిల్‌పై వచ్చిన వాళ్లు సీఎం కాలేరన్నారని పవన్ అన్నారు. నిన్న రాత్రి తనను పోలీసులు అడ్డుకున్నారని, అందుకే నడి రోడ్డుపై కూర్చొని నిరసన చేశారన్నారు. జగన్ వైఖరి గురించి కేంద్ర నాయకత్వానికి చెప్పాలని అనుకుంటున్నానన్నారు.