“‘ఒక భూమి- ఒక కుటుంబం’లో భాగంగా.. నిన్న మనం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాము. ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తును సాకారం చేసుకునేందుకు ఈ జీ20 సదస్సు ఒక వేదికగా మారడం నాకు సంతోషంగా, సంతృప్తికరంగా ఉంది. నవంబర్ చివరిలో జీ20 వర్చ్యువల్ సమావేశాన్ని నిర్వహించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ రెండు రోజుల్లో జరిగిన చర్చలను అప్పుడు రివ్యూ చేద్దాము. ఇందుకు సంబంధించిన వివరాలను మా బృందం మీతో పంచుకుంటుంది. మీరందరు ఈ వర్చ్యువల్ సమావేశానికి హాజరవుతారని ఆశిస్తున్నాను. ఈ మాటలతో.. 2023 జీ20 సదస్సుకు ముగింపు పలుకుతున్నాను,” అని ప్రధాని మోదీ వెల్లడించారు. అనంతరం ప్రపంచ శాంతి కోసం ఓ సంస్కృత శ్లోకాన్ని చదివారు.