Tuesday, October 3, 2023

TS Inter Supplementary Hall Ticket 2023 : ఈనెల 5న తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు..?

TS Inter Supplementary Exams Hall Ticket 2023 : తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 4 నుంచి కాకుండా 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మే 9న ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఫలితాలు విడుదల సందర్భంగా జూన్‌ 4 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ప్రకటించారు. అయితే.. జూన్‌ 4వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు ఉండటం.. ఆ తర్వాత వారం రోజుల పాటు మరికొన్ని పోటీ పరీక్షలు ఉండటంతో సప్లిమెంటరీ పరీక్షల తేదీలను మార్చారు.తాజా షెడ్యూల్‌ ప్రకారం.. జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు నిర్వహించనున్నారు. త్వరలో ఈ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు విడుదల కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. జూన్‌ ఫస్ట్‌వీక్‌లో హాల్‌టికెట్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్‌ బోర్డు తాజాగా సప్లిమెంటరీ ప‌రీక్షల టైం టేబుల్‌ను కూడా విడుద‌ల చేసింది. ప్రథ‌మ సంవ‌త్సరం విద్యార్థుల‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, ద్వితీయ సంవ‌త్సరం విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షల‌ను నిర్వహించ‌నున్నారు.

TS POLYCET Counselling 2023 : తెలంగాణ పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే.. ముఖ్యమైన తేదీలివే

ఫ‌స్టియ‌ర్ ప‌రీక్షల టైమ్‌ టేబుల్‌ :

  • జూన్ 12 (సోమ‌వారం) – లాంగ్వేజ్ పేప‌ర్ -1
  • జూన్ 13 (మంగ‌ళ‌వారం) – ఇంగ్లిష్‌
  • జూన్ 14 (బుధ‌వారం) – మ్యాథ్స్-1(ఎ), బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్
  • జూన్ 15 (గురువారం) – మ్యాథ్స్-1(బి), జువాల‌జీ, హిస్టరీ
  • జూన్ 16 (శుక్రవారం) – ఫిజిక్స్, ఎకాన‌మిక్స్
  • జూన్ 17 (శ‌నివారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్
  • జూన్ 19 (సోమ‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం)
  • జూన్ 20 (మంగ‌ళ‌వారం) – మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ

TS Inter : కాలేజీకి వెళ్లకుండానే.. ఇంటర్మీడియట్‌ పూర్తి చేయొచ్చు.. జస్ట్‌ ఇలా చేస్తే చాలు..!

సెకండియ‌ర్ ప‌రీక్షల టైమ్‌ టేబుల్‌:

  • జూన్ 12 (సోమ‌వారం) – లాంగ్వేజ్ పేప‌ర్ -2
  • జూన్ 13 (మంగ‌ళ‌వారం) – ఇంగ్లీష్‌-2
  • జూన్ 14 (బుధ‌వారం) – మ్యాథ్స్-2(ఎ), బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్
  • జూన్ 15 (గురువారం) – మ్యాథ్స్-2(బి), జువాల‌జీ, హిస్టరీ
  • జూన్ 16 (శుక్రవారం) – ఫిజిక్స్, ఎకాన‌మిక్స్
  • జూన్ 17 (శ‌నివారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్
  • జూన్ 19 (సోమ‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం)
  • జూన్ 20 (మంగ‌ళ‌వారం) – మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ

TSMJBC : గురుకుల ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. లింక్‌ ఇదే

Latest news
Related news