ఈ నెల 14 నుంచి పవన్ పర్యటన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర మొదలు పెట్టనున్నారని నాదెండ్ల తెలిపారు. అన్నవరంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ యాత్ర పొత్తులో భాగంగా జరిగేది కాదన్నారు. తొలి విడత యాత్రలో పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నుంచి నర్సాపురం వరకు పర్యటించనున్నారని తెలిపారు. అన్నవరం నుంచి భీమవరం వరకు తొలి విడత యాత్ర సాగుతుందని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర షెడ్యూల్ ఇప్పటికే ఖరారైందని, పది నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుందన్నారు. ఈ పర్యటనలో ప్రతి రోజూ పవన్ ఫీల్డ్ విజిట్ ఉంటుందని స్పష్టం చేశారు.