Tuesday, October 3, 2023

Kota Srinivasa Rao: రోజుకు రెండు కోట్లు తీసుకుంటా అని ఓపెన్‌గా చెప్పడ‌మేంటి?.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కోట కామెంట్స్‌

Kota Srinivasa rao: సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు మైకు అందుకుంటే ఏం మాట్లాడుతార‌నేది అంద‌రిలో తెలియ‌ని టెన్ష‌న్‌ను క్రియేట్ చేస్తుంది. అందుకు త‌గ్గ‌ట్టే ఆయ‌న నిర్మొహ‌మాటంగా త‌న అభిప్రాయాల‌ను చెప్పేస్తుంటారు. త‌న‌కు న‌చ్చ‌ని విష‌యాల‌పై ఓపెన్‌గా కామెంట్స్ చేసేస్తుంటారు. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయ‌న స్టార్ హీరోల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీనియర్ ఎన్టీఆర్‌లా మ‌రొక‌రు రార‌ని, ఆయ‌న మ‌ళ్లీ పుడితే త‌ప్ప అని అన్నారు కోట శ్రీనివాస‌రావు. అదే స‌మ‌యంలో ‘ఎన్టీఆర్-ఎఎన్నార్..శోభన్..కృష్ణ ఎవ్వరూ ఏనాడూ తమ రెమ్యూనిరేషన్ గురించి బాహాటంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నేను రోజుకు రెండు కోట్లు తీసుకుంటా అని ఓపెన్ గా చెప్పడం ఏమిటి?’ అని కామెంట్స్ పాస్ చేశారు.‘ఇవ్వాళ సినిమా లేదు..మిగిలింది సర్కస్ నే. విషాద గీతాలకు కూడా డ్యాన్స్ లు చేస్తున్నారు. బాత్ రూమ్ బ్రష్ నుంచి బంగారం ప్రకటన వరకు అన్నీ హీరోలే చేస్తే మిగిలిన నటులు ఎలా బతకాలి’ అని నేటి సినిమాలపై ఘాటుగానే రియాక్ట్ అయిన కోట శ్రీనివాసరావు. ఇప్పుడు కోట శ్రీనివాస‌రావు చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (Pawan Kalyan) ఉద్దేశించే కోట శ్రీనివాస‌రావు అలాంటి మాట‌లు మాట్లాడార‌ని నెటిజ‌న్స్ భావిస్తున్నారు. అందుకు కార‌ణం.. కొన్నాళ్లు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ప‌బ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ తాను రోజుకి రెండు కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాన‌ని చెప్పారు. ఇప్పుడు కోట దానిపైనే కామెంట్స్ చేశారంటున్నారు నెటిజ‌న్స్‌.

కోట చేసిన కామెంట్స్‌పై నెటిజ‌న్స్ అస‌లు ఈయ‌న బాధ ఏంట‌ని అని కామెంట్స్ పెడుతున్నారు. కోటకు ఎక్కడో కాలినట్టుందని అందుకనే అలా మాట్లాడారని మరి కొందరు అంటున్నారు. అలాగే అన్నీ యాడ్స్‌లో స్టార్ హీరోలు చేయ‌టంపై కోట చేసిన కామెంట్స్‌పై కూడా నెటిజ‌న్స్ త‌మ‌దైన రీతిలో రియాక్ట్ అవుతున్నారు. నువ్వు చేస్తే ఎవ‌డు చూస్తాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కమర్షియల్ యాడ్ మేకర్స్ స్టార్ వేల్యూని బట్టే కాంటాక్ట్ అవుతారు. ఓ స్టార్‌తో యాడ్ చేస్తున్నారంటే వాళ్లెంతో లెక్కలు వేసుకుంటారని అంటున్నారు నెటిజన్స్.

జబర్దస్త్ రాంప్రసాద్ హైలైట్.. ‘నేను స్టూడెంట్ సర్’ టాక్

లోక‌ల్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌ని చెప్పేవాళ్ల‌లో కోట శ్రీనివాస‌రావు ఎప్ప‌టికీ ఉంటారు. విల‌న్స్‌, ప్ర‌ధాన పాత్ర‌ల కోసం ఇత‌ర సినీ ఇండ‌స్ట్రీల‌పై ఆధార‌ప‌డ‌టం స‌రికాద‌ని అంటుంటారు. కోట ఇలా మాట్లాడినప్పుడంతా .. ఆయన ఇతర భాషల్లోకి వెళ్లి నటిస్తే తప్పు లేదు కానీ, వేరే వాళ్లు ఇక్కడ యాక్ట్ చేస్తే తప్పా అని కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి.

Rana Daggubati: బాహుబ‌లి, RRR రికార్డుల‌ను ‘ప్రాజెక్ట్ K’ బద్దలు కొడుతుంది.. రానా సెన్సేషనల్ కామెంట్స్

Latest news
Related news