Tuesday, October 3, 2023

థైరాయిడ్‌లో వచ్చే.. 4 సాధారణ సమస్యలు ఇవే..!

హైపర్ థైరాయిడిజం..

హైపర్ థైరాయిడిజం..

హైపర్‌ థైరాయిడిజం సమస్యలో థైరాయిడ్ హార్మోను ఎక్కువగా విడుదల అవుతుంది. టి3, టి4 హార్మోన్లు ఎక్కువగా విడుదలై టీఎస్‌హెచ్ తగ్గిపోతుంది. దీని కారణంగా జీవక్రియల పనితీరు వేగం పెరుగుతుంది. HHS పబ్లిక్ యాక్సెస్ అధ్యయనం ప్రకారం USలో 1-3 శాతం మంది వ్యక్తులు హైపర్‌ థైరాయిడిజంతో బాధపడుతున్నారు. ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హైపర్ థైరాయిడిజం గ్రేవ్స్ వ్యాధికి దారి తీస్తుంది. హైపర్‌ థైరాయిడిజంలో గుండెదడ, బరువు తగ్గిపోవడం, కనుగుడ్లు బయటకు వచ్చినట్లు కనిపించడం అకారణంగా చెమటలు పట్టడం, పేగుల కదలిక ఎక్కువ జరిగి విరేచనాలు కావడం, లాంటి సమస్యలు ఎదురవుతాయి. నిద్ర పట్టక పోవడం, చేతులు వణకడం, మానసిక ఒత్తిడి, చల్లగా ఉన్న వేళల్లోనూ వేడిగా అనిపించడం, ఎక్కువగా చెమటపట్టడం, నెలసరి క్రమం తప్పడం, ఎక్కువసార్లు మలవిసర్జనకు వెళ్లవలసి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
హైపర్‌ థైరాయిడిజంను చికిత్సలో రేడియోయోడిన్ థెరపీ, యాంటీ థైరాయిడ్ మందులు, బీటా-బ్లాకర్స్, సర్జరీ వంటి ఆప్షన్స్‌ ఉంటాయి. అవి థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తిని నిరోధిస్తాయి.

హైపో థైరాయిడిజం..

హైపో థైరాయిడిజం..

హైపో థైరాయిడిజంలో థైరాయిడ్ హార్మోను తక్కువగా విడుదలవుతుంది. టి3, టి4 హార్మోన్లు తగ్గుతాయి. టీఎస్‌హెచ్ పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది. దాంతో నిస్తేజంగా, నీరసంగా కనిపిస్తాం. శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. బరువు పెరిగిపోతారు. వీటన్నింటితో పాటు మలబద్ధకం, పిల్లలు కలగకపోవడం, రక్తహీనత, నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడం గుండె కొట్టుకునే వేగం తగ్గడం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, గోళ్లు విరిగిపోయినట్లు కనిపించడం, డిప్రెషన్, లాంటి మార్పులు కనిపిస్తాయి.
హైపోథైరాయిడిజం టైప్‌ 2 డయాబెటిస్‌, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చే ముప్పును పెంచుతుంది. హైపోథైరాయిడిజం ఉన్నవారు థైరాయిడ్‌ హార్మోన్‌ పిల్స్‌ వాడాల్సి ఉంటుంది.​

Jasmine tea: ఈ టీ రోజు తాగితే.. త్వరగా బరువు తగ్గుతారు..!

​గాయిటర్‌..

​గాయిటర్‌..

​థైరాయిడ్‌ గ్రంథిలో అసాధారణ పెరుగుదలను గాయిటర్‌ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కనీసం 15.8 శాతం జనాభాను ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గాయిటర్ సాధారణంగా 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న, థైరాయిడ్‌ సమస్యతో బాధపడే మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. అధిక బరువు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారిలో గాయిటర్ వచ్చే అవకాశం ఎక్కువ.

థైరాయిడ్‌ నాడ్యూల్స్‌..

థైరాయిడ్‌ నాడ్యూల్స్‌..

థైరాయిడ్‌ నాడ్యూల్స్‌లో థైరాయిడ్‌ గ్రంథికి ఒక భాగంలో ఒకటి లేదా మరిన్ని గడ్డలు ఏర్పడతాయి. శరీరంలో అయోడిన్‌ లోపం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. ఇవి ప్రాణానికి ప్రమాదం కావు. థైరాయిడ్‌ నాడ్యూల్స్‌ ఎలాంటి లక్షణాలు చూపించవు. పెద్దగా పెరిగితే, మీ మెడలో వాపు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. థైరాయిడ్‌ నాడ్యూల్స్‌ ఉంటే.. అధిక పల్స్ రేటు, నీరసం, ఆకలి పెరగడం, వణుకు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.​

Thyroid Health: థైరాయిడ్‌ను ఆరోగ్యంగా ఉంచే.. మూలికలు ఇవే..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news