ప్రైవేట్ సంస్థ అయిన స్కైమేట్ వెదర్ సర్వీసెస్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. “జూన్ 3,4 తేదీల్లో రుతుపవనాలు ప్రారంభం అవుతాయని మేం భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రుతుపవనాల పురోగతిపై అనిశ్చితి నెలకొని ఉంది. జూన్ 6 లేకపోతే జూన్ 7వ తేదీ నాటికి అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే, తేమ అంతా అల్ప పీడనం చుట్టూ కేంద్రీకృతం అవుతుంది. ఇది రుతుపవనాల విస్తరణ ఆటంకం కలిగిస్తుంది. పశ్చిమ తీరం చుట్టూ వర్షాలు కురుస్తాయి. అయితే జూన్ 10 వరకు ఆ ప్రాంతాలను రుతుపవనాలు తాకకపోవచ్చు. రుతు పవనాల విస్తరణకు ప్రస్తుత పరిస్థితి అంత అనుకూలంగా లేవు” అని స్కైమేట్ వెదర్ క్రైమేట్, మెట్రాలజీ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ పలావత్ చెప్పారు.