Saturday, June 3, 2023

YS Viveka Case: వివేకా హత్య గురించే జగన్ కు ముందే తెలుసు – కౌంటర్ అఫిడవిట్ లో CBI

వాడివేడిగా వాదనలు

మరోవైపు వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారించింది. వెకేషన్‌ బెంచ్‌లో వాడివేడిగా వాదనలు కొనసాగాయి. సునీతా రెడ్డి, అవినాశ్ రెడ్డి పిటిషన్లకు సంబంధించి వాదనలు వినగా… శనివారం సీబీఐ వాదనలు వింటామని కోర్టు తెలిపింది. అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ… అవినాశ్ రెడ్డి విషయంలో సీబీఐ చెబుతున్న కారణాలకు సంబంధం లేదన్నారు. భాస్కర్‌రెడ్డి కోసం ర్యాలీలు జరిగితే అవినాశ్ అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏంటి? అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవినాశ్ ని ఇరికించేలా కుట్ర జరుగుతోందన్నారు. వివేకా హత్యకు సంబంధించి అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటివరకు ఎక్కడా నిందితుడని చెప్పలేదని పేర్కొన్నారు. విచారణకు పిలిచిన ఏడు సార్లు హాజరయ్యారని చెప్పారు. విచారణకు సహకరించడం అంటే సీబీఐ వాళ్లు రాసిచ్చింది చెప్పడమా అని వాదనలు వినిపించారు. అసలు ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియోలను హైకోర్టు ముందుంచాలని కోరారు. రూ.4కోట్లతో అవినాశ్ రెడ్డికి సంబంధమేంటని… గంగిరెడ్డి రూ.కోటి ఇచ్చాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడ.. ఆ డబ్బులు అవినాశ్ రెడ్డి ఇచ్చారని గంగిరెడ్డి చెప్పారా అని లెవనెత్తారు. హత్య చేసిన దస్తగిరిని సీబీఐ వెనకేసుకొస్తోందని అన్నారు. దస్తగిరి ముందస్తు బెయిల్ ను కూడా సీబీఐ వ్యతిరేకించలేదని ప్రస్తావించారు. గంగిరెడ్డి ఢీఫాల్ట్ బెయిల్ పై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన సునీత.. వివేకా కేసులో ఏ1గా దస్తగిరి బయట తిరుగుతుంటే మాత్రం స్పందించట్లేదన్నారు.

Source link

Latest news
Related news