Sunday, June 4, 2023

TS POLYCET Counselling 2023 : తెలంగాణ పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే.. ముఖ్యమైన తేదీలివే

TS POLYCET Counselling Dates 2023 : తెలంగాణలో ఇంజనీరింగ్, నాన్‌– ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో (పాలిటెక్నిక్‌) ప్రవేశానికి రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు (TS POLYCET Results 2023) మే 26న విడుదలైన విషయం తెలిసిందే. బాలురు, బాలికలు కలిపి మొత్తం మీద 82.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అర్హులైన వారికి జూన్‌ 14 నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. 2023లో రాష్ట్రంలో మరో నాలుగు పాలిటెక్నిక్‌ కాలేజీలు కొత్తగా వస్తున్నాయని వెల్లడించారు. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీలు, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టికల్చర్‌ వర్సిటీల్లోని కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారనే సంగతి తెలిసిందే. ఇక.. కౌన్సెలింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

TS POLYCET Results 2023 : తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. చెక్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే

తొలి విడత కౌన్సెలింగ్‌

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం, స్లాట్‌ బుకింగ్‌: జూన్‌ 14 నుంచి 18 వరకు
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌: జూన్‌ 16 నుంచి 19 వరకు
  • వెబ్‌ ఆప్షన్లు: జూన్‌ 16 నుంచి 21 వరకు
  • ఆప్షన్ల ఫ్రీజింగ్‌: జూన్‌ 21
  • సీట్ల కేటాయింపు: జూన్‌ 25
  • ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: జూన్‌ 25 నుంచి 29 వరకు

తుది విడత కౌన్సెలింగ్‌

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం స్లాట్‌బుకింగ్‌: జూలై 1
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌: జూలై 2
  • వెబ్‌ ఆప్షన్లు: జూలై 1 నుంచి 3 వరకు
  • ఆప్షన్ల ఫ్రీజింగ్‌: జూలై 3
  • సీట్ల కేటాయింపు: జూలై 7
  • ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: జూలై 7 నుంచి 10 వరకు.

TS EAMCET Results 2023 : వెబ్‌సైట్‌లో తెలంగాణ ఎంసెట్‌ ర్యాంక్‌ కార్డులు.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

స్పాట్‌ అడ్మిషన్లు

  • స్పాట్‌ అడ్మిషన్ల ప్రకటన: జూలై 7
  • ఫీజు చెల్లింపు: జూలై 8, 9
  • ర్యాంక్‌ జనరేషన్‌: జూలై 10
  • వెబ్‌ ఆప్షన్లు: జూలై 8 నుంచి 11 వరకు
  • ఆప్షన్ల ఫ్రీజింగ్‌: జూలై 11
  • సీట్ల కేటాయింపు: జూలై 14
  • ఫీజు చెల్లించడం, ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: జూలై 14 నుంచి 15 వరకు
  • కాలేజీల్లో రిపోర్ట్‌ చేయడం: జూలై 15, స్పాట్‌ అడ్మిషన్లు పూర్తి జూలై 17

AP POLYCET Counselling 2023 : ఏపీ పాలిసెట్‌ కౌన్సెలింగ్‌.. పూర్తి వివరాలివే

Latest news
Related news