Sunday, June 4, 2023

TS EAMCET Results 2023 : వెబ్‌సైట్‌లో తెలంగాణ ఎంసెట్‌ ర్యాంక్‌ కార్డులు.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

TS EAMCET Results 2023 : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మే 25న విడుదలైన సంగతి తెలిసిందే. జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో గురువారం (మే 25) ఉదయం 9.45 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాలను వెల్లడించిన నేపథ్యంలో.. విద్యార్థులకు సంబంధించిన ఫలితాలతో పాటు, ఎంసెట్ ర్యాంకు కార్డులను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఎంసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎంసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.TS EAMCET 2023 ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి

TS EAMCET Results 2023 : ఎంసెట్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 3 మార్కులు కలిపారు.. పూర్తి వివరాలివే

ఇక తాజాగా విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మొత్తంగా 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అగ్రికల్చర్ అండ్‌ ఫార్మా విభాగంలో 91,935 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,57,879 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

TS EAMCET Results 2023 Live : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. చెక్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే

TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల.. టాపర్ల లిస్ట్‌ ఇదే

Latest news
Related news