Sunday, June 4, 2023

Kangana Ranaut: పొట్టి బట్టల్లో గుడికి వచ్చిన అమ్మాయి.. కంగనా రనౌత్ సీరియస్!

బీటౌన్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) నోటి దురుసు గురించి తెలిసిందే. తనకు తప్పనిపిస్తే ఎంత పెద్ద వ్యక్తులనైనా తూర్పారా పట్టేందుకు వెనకాడదు. ఇక ఏ సపోర్ట్ లేకుండా బాలీవుడ్‌లో ఎదిగిన కంగన.. బీటౌన్ నెపోటిజం, స్టార్ కిడ్స్‌పైనా బాహాటంగానే విమర్శలు గుప్పిస్తుంటుంది. అలాగే హిందూ సంప్రదాయాలను అమితంగా విశ్వసించే తను.. వాటిని ఎవరైనా అతిక్రమిస్తే స్పందించకుండా ఉండదు. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) బైజ్యనాథ్ ఆలయానికి (Baijnath Temple) ఒక అమ్మాయి షార్ట్స్ ధరించి (Short Dress) వచ్చిన ఫొటో నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ ఫొటో చూసి సీరియస్ అయిన కంగన తన అసంతృప్తిని వెల్లగక్కింది.

మే 25న ట్వీట్‌ చేయబడిన ఈ పిక్‌లో ఇద్దరు మహిళలు బైజ్యనాథ్ ఆలయ ప్రాంగణంలో షార్ట్స్‌లో నిలబడి ఉన్నారు. కాగా ఈ ఫొటోను షేర్ చేస్తూ.. ఆలయ ప్రదేశాల్లోకి పొట్టి లేదా సాధారణ దుస్తులను అనుమతించరాదని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్ కంగన దృష్టికి చేరడంతో వాటికన్‌ సిటీని సందర్శించినప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటూ సదరు ట్వీట్‌ను రీపోస్ట్ చేసింది. అంతేకాదు ఈ పాశ్చాత్య దుస్తులను తెల్లవాళ్లే పరిచయం చేసి, ప్రమోట్ చేశారంటూ అభిప్రాయపడింది.

మతపరమైన ప్రదేశాల్లో ‘పొట్టి బట్టలు’ ధరించడం గురించి మాట్లాడుతూ.. వాటికన్‌లో తను ఇలాంటి బట్టలు వేసుకున్నప్పుడు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ‘ఇవి శ్వేతజాతీయులు పరిచయం చేసి, విస్తృతంగా ప్రచారం చేసినటువంటి పాశ్చాత్య దుస్తులు. నేను ఒకప్పుడు వాటికన్‌లో షార్ట్స్, టీ-షర్ట్ ధరించి వెళ్తే నన్ను ఆవరణలోకి కూడా అనుమతించలేదు. దీంతో హోటల్‌కి వెళ్లి బట్టలు మార్చుకుని వెళ్లాల్సి వచ్చింది. క్యాజువల్స్ వలె నైట్ డ్రెస్‌లు వేసుకునే వీళ్లు సోమరిపోతులే తప్ప మరోటి కాదు. వారికి వేరే ఉద్దేశ్యం ఉంటుందని నేను అనుకోను కానీ అలాంటి మూర్ఖులకు కఠినమైన నియమాలు ఉండాలి’ అని ట్వీట్ చేసింది.

‘2018’ సీన్లు చూస్తే ఎవడ్రా తీసిందనిపిస్తోంది: ఎస్‌కేఎన్

ఇక కంగన ట్వీట్ పట్ల నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. బెడ్ రూమ్, బీచ్, పార్టీలో ఒకే రకమైన దుస్తులు ధరించరాదని, తప్పనిసరిగా సందర్భానికి తగ్గ దుస్తులు ధరించాలని ఒక నెటిజన్ పేర్కొంది. అలాగే ట్విట్టర్‌ యాజర్.. పాశ్చాత్యీకరణ మన సంస్కృతి, విలువలకు మంచిది కాదని అభిప్రాయపడింది. ఇక కంగనా విషయానికొస్తే.. తను తరచూ ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తుంటుంది. ఇటీవలే ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన కంగ.. ప్రస్తుతం హరిద్వార్‌లో ఉంది. అక్కడి దేవాలయాలతో పాటు పవిత్ర గంగానదికి పూజలు చేస్తోంది.

Latest news
Related news