Saturday, June 3, 2023

jio, New Plan: వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జియో – jio announces new broadband plan 3 months interest for rs 1200


New Plan: టెలికాం రంగంలో ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తున్న రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. ఇటు జియోతో పాటు జియో ఫైబర్‌ ద్వారా బ్రాండ్‌బ్యాండ్‌ సర్వీసుల విషయంలోనూ అంతే వేగంగా దూసుకెళ్తోంది. బ్రాడ్ బ్యాండ్ వాడే వినియోగదారుల కోసం అతి తక్కువ ధరలో ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్లను తీసుకు వస్తోంది. తాజాగా ఫైబర్‌ యూజర్ల కోసం మూడు నెలల ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.1197గా నిర్ణయించింది.

ప్లాన్ సదుపాయాలు
కేవలం ఇంటర్నెట్‌ మాత్రమే కోరుకునే వారి కోసం ఈ మూడు నెలల ప్లాన్‌ సరిపోతుందని జియో ఒక ప్రకటనలో తెలిపింది. 90 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌లో భాగంగా 30 ఎంబీపీఎస్‌ వేగంతో డేటా లభిస్తుంది. ప్రతి నెలా అపరిమిత డేటా 3.3 టీబీ వరకు వస్తుందని పేర్కొంది. దీనితో పాటు కాలింగ్‌ సదుపాయం కూడా ఈ ప్లాన్‌లో ఉంటుందని చెప్పింది. అయితే ఓటీటీ సదుపాయాలు మాత్రం ఈ ప్లాన్‌లో లభించవని వెల్లడించింది. దీనికి రూ.1197 ధరను నిర్ణయించగా.. జీఎస్టీ అదనంగా ఉంటుందని తెలిపింది.

మూడు నెలల ప్లాన్లు
జియో ఫైబర్‌లో రూ.399 నుంచి ప్లాన్లు ప్రారంభమవుతున్నాయి. బేసిక్‌ ప్లాన్లు లభించే సదుపాయాలే మూడు నెలల ప్లాన్‌లోనూ ఉన్నాయి. అయితే ప్రతినెలా రీఛార్జి చేసుకునే బదులు ఒకేసారి రీఛార్జి చేసుకునే వారికి ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. ఒకవేళ టీవీ ఛానెళ్లు, ఓటీటీ వంటివి కావాలనుకునే వారు అధిక మొత్తం చెల్లించి ఇతర ప్లాన్లు తీసుకోవాల్సి ఉంటుంది. రూ.1197ప్లాన్‌ మాదిరిగానే 100 ఎంబీపీఎస్‌తో వచ్చే రూ.699 ప్లాన్‌ను మూడు నెలకు రూ.2097లకు లభిస్తుంది. అంతకంటే ఇంకా ఎక్కువ స్పీడ్‌తో కావాలంటే 150 ఎంబీపీఎస్‌తో వచ్చే రూ.999 ప్లాన్‌ను 3 నెలలకు రూ.2997కు అందిస్తోంది. 300 ఎంబీపీఎస్‌ వేగంతో వచ్చే రూ.1499 ప్లాన్‌ను రూ.4497 ప్లాన్‌తో పొందవచ్చు. వీటితోపాటు మరికొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్లను త్రైమాసిక ప్లాన్ల రూపంలో జియో అందిస్తోంది.



Source link

Latest news
Related news