29 నుంచి మళ్లీ వర్షాలు..
ఇక తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ, రేపు కూడా ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 29, 30,31 తేదీల్లో వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. మే 29 -30 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇక శుక్రవారం నల్గొండ జిల్లా దామరచర్లలో గరిష్ఠంగా 44.3 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది.