Sunday, June 4, 2023

TS POLYCET Results 2023 : తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. చెక్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే

TS POLYCET Results 2023 :తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. (రిజల్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి) రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న, వెట‌ర్న‌రీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించిన టీఎస్ పాలీసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష మే 17న నిర్వహించిన విషయం తెలిసిందే. మే 17న ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష కొన‌సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 296 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించారు. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు 92.94 శాతం మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.TS EAMCET Results 2023 : ఎంసెట్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 3 మార్కులు కలిపారు.. పూర్తి వివరాలివే

TS POLYCET ప్ర‌వేశ ప‌రీక్ష‌కు 58,520 మంది బాలురు, 47,222 మంది బాలిక‌లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 54,700 మంది బాలురు, 43,573 మంది బాలిక‌లు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. మొత్తంగా 1,05,742 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 98,273 మంది హాజ‌రైన‌ట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన అఫీషియల్‌ ఆన్సర్‌ కీ ని కూడా ఇప్పటికే విడుదల చేశారు. అలాగే TS POLYCET Results 2023 మే 26న విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

TS EAMCET Results 2023 Live : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. చెక్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Latest news
Related news