Sunday, June 4, 2023

leave encashment limit, Tax: ఉద్యోగులకు అదిరే శుభవార్త.. రూ.25 లక్షల వరకు నో ట్యాక్స్.. లీవ్ ఎన్‌క్యాష్ లిమిట్ పెంపు! – leave encashment limit increased to rs 25 lakh cbdt notification new tax benefit for salaried


Tax: వేతన జీవులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్. ప్రైవేటు ఉద్యోగులకు అదిరే శుభవార్త అందించింది. లీవ్ శాలరీ ఎన్‌క్యాష్‌మెంట్ లిమిట్‌ రూ.25 లక్షలకు పెంచుతూ నోటిఫై చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (CBDT). 2002 నుంచి లీవ్ ఎన్‌క్యాష్ లిమిట్ రూ.3 లక్షలుగా మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని దాదాపు 9 రెట్లు పెంచడం గమనార్హం. ఈ మేరకు సీబీడీటీ మే 24, బుధవారం రోజున ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. పెంచిన లీవ్ ఎన్‌క్యాష్ లిమిట్ అనేది ఆర్థిక ఏడాది 2023-24కు వర్తిస్తుంది. ఏప్రిల్ 1 నుంచే ఇది అమలులోకి వస్తుందని సీబీడీటీ తెలిపింది.’ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 10 క్లాజ్ 10ఏఏ సబ్ క్లాజ్ 2 ప్రకారం దఖలు పడిన అధికారాల మేరకు కేంద్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి తన పదవీ విరమణ లేదా రాజీనామా నాటికి లీవ్ శాలరీకి సమానమైన నగదు పన్ను మినహాయింపు పరిమితిని రూ.25,00,000లకు పెంచింది. ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 1, 2023 నుంచే అమలులోకి వస్తుంది.’ అని తెలిపింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. బడ్జెట్ 2023-24లోనే నాన్ గవర్నమెంట్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలు పెంచుతామన్న హామీని అమలు చేస్తూ సీబీడీటీ నోటిఫికేషన్ జారీ చేసింది.

గతంలో నాన్ గవర్నమెంట్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు పరిమితిని చివరి సారిగా 2002లో రూ.3 లక్షలుగా నిర్ణయించింది ప్రభుత్వం. లీవ్ ఎన్‌క్యాష్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్‌తో పాటు బడెజ్ట్ 2023లోని చాలా ప్రతిపాదనలకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట కలిగిస్తూ కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చి పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచింది. అలాగే శాలరీ పర్సన్‌కు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ కల్పించింది.

ఉదాహరణకు ఒక ఉద్యోగి రూ.10 లక్షలు లీవ్ ఎన్‌క్యాష్ నగదు అందుకుంటున్నట్లయితే రూ.3 లక్ష పన్ను మినహాయింపు పరిమితి ఉంటే మిగిలిన నగదుపై 30 శాతం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే రూ.2,10,000 లక్షల ట్యాక్స్ పడేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.25 లక్షలు పెంచింది ప్రభుత్వం. దీంతో రూ.10 లక్షలపై ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.

Rental Income: ఆదాయం రూ.10 లక్షలు ఉన్నా ట్యాక్స్ కట్టక్కర్లేదు.. ఎలాగో తెలుసుకోండి!Gold: రూ.2000 నోట్లతో బంగారం కొంటున్నారా? దానికో లిమిట్ ఉంది.. ఈ రూల్స్ తెలుసుకోండి!Credit Card: ఆ క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. పరిమితి మించితే అంతే!



Source link

Latest news
Related news