Thursday, June 1, 2023

Fat Burning : బాడీలో కొవ్వు తగ్గాలంటే వీటిని ఫాలో అవ్వాల్సిందే.. – surprising ways to speed up fat burning

​న్యూట్రిషనిస్టుల ప్రకారం..

​న్యూట్రిషనిస్టుల ప్రకారం..

న్యూట్రిషనిస్ట్ మాన్సీ కొవ్వుని కరిగించేందుకు కొన్ని టిప్స్ గురించి చెబుతున్నారు. అవి మీ వెయిట్‌లాస్ జర్నీలో కచ్చితంగా హెల్ప్ చేస్తాయి. రెగ్యులర్‌గా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అవేంటంటే..

తినకుండా వర్కౌట్..

తినకుండా వర్కౌట్..

బరువు తగ్గేందుకు వర్కౌట్ చేయడం చాలా ముఖ్యం. అయితే, ఏం తినకుండా వర్కౌట్ చేస్తే ఎక్స్‌ట్రా రిజల్ట్స్ ఉంటాయి. ఈ టైమ్‌లో మీ బాడీ కాస్తా స్పీడ్‌గా ఉంటుంది. ఫ్యాట్ బర్న్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది. స్పీడ్‌గా వాకింగ్ చేయడం వల్ల కూడా ఈజీగా బరువు తగ్గేలా చేస్తుంది.

వెయిట్ లిఫ్టింగ్..

వెయిట్ లిఫ్టింగ్..

బరువు తగ్గేందుకు వెయిట్ లిఫ్టింగ్ కూడా బెస్ట్ వర్కౌట్ అని మాన్సి చెబుతున్నారు. వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల జీవక్రియ పెరుగుతుందని చెబుతున్నారు. అయితే, ఎంత వీలైతే అంతే బరువులు ఎత్తాలని సూచిస్తున్నారు.
Also Read : After 40 : నలభై దాటిన మహిళలు ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట..

డిన్నర్..

డిన్నర్..

బరువు తగ్గాలనుకునేవారు డిన్నర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు, ఏం తింటున్నారనే విషయంలో క్లారిటీ ఉండాలి. నిద్రపోయే ముందు తక్కువగా తినాలి. అదేవిధంగా, ముందుగానే తినాలి. ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు.
Also Read : Yoga Benefits : రోజూ యోగా చేస్తే ఈ సమస్యలు దూరం..

నిద్ర..

నిద్ర..

పోషకాహార నిపుణుల ప్రకారం, శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు హాయిగా నిద్రపోవడం వల్ల కరిగిపోతుందని ఎంత మందికి తెలుసు. అందుకే హాయిగా నిద్రపోవాలి. అదే విధంగా, నిద్రకి డిన్నర్‌కి చాలా గ్యాప్ ఉండాలని చెబుతున్నారు. దీని వల్ల హాయిగా నిద్రపడుతుంది. దీని వల్ల బాడీలో కొవ్వు కరిగేందుకు హెల్ప్ అవుతుంది.

గ్రీన్ టీ..

గ్రీన్ టీ..

అదే విదంగా, గ్రీన్ టీ కూడా బరువు తగ్గేందుకు బాగా హెల్ప్ అవుతుంది. దీనిలోని గుణాలు ఫ్యాట్ బర్న్ అయ్యేందుకు హెల్ప్ అవుతాయి. అందుకే రెగ్యులర్‌గా గ్రీన్ టీ తాగడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.​

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​​​​​​​​​​​​​​​​Read More :Fitness Newsand Telugu News

Latest news
Related news