Mobile Number: ఏదైనా సూపర్ మార్కెట్ కానీ, షాపింగ్ మాల్స్‌కి గానీ వెళ్లి షాపింగ్ చేసి బిల్ చెల్లించే సమయంలో అక్కడ కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి కస్టమర్ మొబైల్ ఫోన్ నంబర్ అడుగడం చూసే ఉంటారు. మీరూ ఎన్నో సార్లు మీ మొబైల్ నంబర్ ఇచ్చే ఉంటారు. బిల్ చెల్లించడానికి మొబైల్ నంబర్‌తో అవసరం ఏమిటి అని ఒక్క మాట కూడా అడగకుండా కస్టమర్లు ఇచ్చి బిల్ పేమెంట్ చేసి వెళ్లిపోతుంటారు. ఇలా మాల్స్, సూపర్ మార్కెట్లలో మాత్రమే కాదు బయట లక్కీ డ్రా పేరుతో ఫోన్ నంబర్లు సేకరిస్తుంటారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ మీ మొబైల్ నంబర్, కాంటాక్ట్ వివరాలు ఇవ్వడం ద్వారా మోసాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. మన నంబర్ తీసుకుని మిస్ యూజ్ చేయవచ్చు. ప్రస్తుత రోజుల్లో ఫోన్ కాల్స్, మెసేజ్ లు పంపించి మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నా. ఇలా మోసాలు పెరిగిపోతున్న క్రమంలో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్ల వంటి వాటిల్లో కస్టమర్ల నుంచి బలవంతంగా ఫోన్ నంబర్లను సేకరించకూడదని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఫోన్ నంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు ఇచ్చే వరకు బిల్ ప్రాసెస్ పూర్తి చేయలేమని చెబుతుంటారని, ఇది వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం అన్యాయమైన, నిర్బంధ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని చెప్పారు. ఫోన్ నంబర్లు, ఇతర సమాచారాన్ని సేకరించడం వెనుక ఎలాంటి ప్రయోజనం కలిగించే అంశం లేదని స్పష్టం చేశారు.
‘కస్టమర్ల ప్రైవసీకి సంబంధించిన ఆందోళనలు ఉన్నాయి. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం కస్టమర్ల వివరాలు సేకరించకూడదు. కన్జ్యూమర్స్ ప్రయోజనాల దృష్ట్యా రిటైల్ పరిశ్రమలు, ఇండస్ట్రీ ఛాంబర్స్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ లాంటి వాటికి అడ్వైజరీ జారీ చేశాం. ఏదైనా డెలివరీ చేయడానికి, బిల్లులు రూపొందించేందుకు రిటైలర్లకు ఫోన్ నంబర్లను అందించడం మన దేశంలో అవసరం లేదు. అయినప్పటికీ రిటైలర్లు ట్రాన్సాక్షన్లు పూర్తి చేసేందుకు మొబైల్ నంబర్లను అడిగితే దాంతో కస్టమర్లు సమస్యలో పడే అవకాశం ఉంది.’ అని రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.
ఈసారి నంబర్ ఇడిగితే ఇలా చేయండి..
మీరు ఈసారి షాపింగ్‌కు వెళ్లినప్పుడు మీ మొబైల్ నంబర్ అడిగినట్లయితే ఇవ్వమని చెప్పేయండి. బిల్లు చెల్లించే సమయంలో మీ ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడి సిబ్బంది తప్పనిసరిగా ఇవ్వాలని, లేకుంటే బిల్ చేయడం కూదరదని వాదిస్తే వినియోగదారుల చట్టం రూల్స్ గుర్తు చేయండి. మీ నంబర్ మిస్ యూజ్ కాకుండా చూసుకోండి.
SBI కస్టమర్లకు మంచి ఛాన్స్.. ఇంట్లోంచే PPF ఖాతా తెరవొచ్చు.. ఎలాగంటారా?
PAN Card: మీ వద్ద పాన్ కార్డు లేదా.. సింపుల్‌గా ఇలా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి మరి!
Aadhaar Card Update: ఆధార్ కార్డులో తప్పులున్నాయా? ఈ నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే పరిష్కారం!