- ముందుగా జేఈఈ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
- రిజల్ట్ (result) ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
- అడ్మిట్ కార్డ్ నెంబర్ వంటి వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
- స్క్రీన్ పై జేఈఈ మెయిన్ 2023 పేపర్ 2 ఫలితాలు కనిపిస్తాయి. విద్యార్థులు తమ రిజల్ట్ చెక్ చేసుకుని, సంబంధిత పేజీని డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.
- భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ ను ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
Counselling details: కౌన్సెలింగ్ వివరాలు..
పేపర్ 2 ఫలితాల వెల్లడి ద్వారా, ఇప్పుడు జేఈఈ మెయిన్స్ 2023 పేపర్ 1, పేపర్ 2 రెండు సెషన్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. జేఈఈ మెయిన్ సెషన్ 2 పేపర్ 1 ఫలితాలను ఏప్రిల్ 29న విడుదల చేశారు. ఈ పరీక్షలో 43 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్స్ 2023 లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సంబంధిత వివరాలను త్వరలో వ్యక్తిగతంగా పంపిస్తుంది.