పీనట్ బటర్..

వర్కౌట్‌కి ముందు తినడానికి కూడా పీనట్ బటర్ మంచి ఆప్షన్. దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల వర్కౌట్ చేసేందుకు సరిపడా శక్తిని ఇస్తుంది.
Also Read : Sabja seeds : సబ్జా నీరు తాగితే బరువు తగ్గుతారా..
హోల్ గ్రెయిన్ బ్రెడ్..

హోల్ గ్రెయిన్ బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది మీ వర్కౌట్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు మీరు ప్రోటీన్ కోసం పనీర్, గుడ్డు, చీజ్ తినొచ్చు. ఇది కూడా వర్కౌట్‌కి 30 నుంచి 40 నిమిషాల ముందు తినొచ్చు.
డ్రై ఫ్రూట్స్..

డ్రై ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలోని ఎనర్జీ లెవల్స్‌ని పెంచుతాయి. కాబట్టి, రెగ్యులర్‌గా వీటిని తీసుకోవడం మంచిది.
గుడ్డు..

వర్కౌట్‌కి ముందు గుడ్లు తినడం కూడా మంచిది. ఇందులోని ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ ఇంటాయి. ఇవి శరీరాన్ని బలంగా చేస్తాయి. కండరాల నిర్మాణంలో సాయపడతాయి. వర్కౌట్‌కి 30, 40 నిమిషాల మందు గుడ్లు తినొచ్చు.
Also Read : Weight Loss Journey : ఈ మూడు అలవాట్లని మార్చి 15 కిలోల బరువు తగ్గాడు..
అరటిపండు..

అరటిపండు.. అందరికీ సులువుగా లభించే ఈ పండులో కార్బోహైడ్రేట్స్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల తక్షణమే శక్తి అందుతుంది. నరాలు, కండరాలు సరిగ్గా పనిచేసేందుకు అరటిపండ్లు బాగా హెల్ప్ చేస్తాయి.
ఓట్స్..

ఓట్స్‌లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా కాలం పాటు శక్తి ఉండేలా చూసుకుంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చాలాకాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది.
స్మూతీస్..

తాజా సీజనల్ ఫ్రూట్స్‌తో చేసిన స్మూతీలు కూడా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. స్మూతీని బ్లెండ్ చేసేటప్పుడు అందులో కొద్దిగా ప్రోటీన్ పౌడర్ యాడ్ చేయొచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More :Fitness Newsand Telugu News