Monday, October 2, 2023

microsoft news, IT Employees: హైక్స్ లేక నిరాశలో ఉద్యోగులు.. ఆదాయం పెంచుకునే మార్గం చెప్పిన ఐటీ దిగ్గజం! – microsoft cmo tells workers stock price most important lever to get pay raise


IT Employees: ప్రపంచ వ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగించడంతో పాటు జీతాల పెంపును సైతం వాయిదా వేస్తున్నాయి. అందులో ఒకటి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను పెంచడం లేదని మైక్రోసాఫ్ట్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి కంపెనీ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. తీవ్ర నిరాశలోకి జారుకున్నారు. అయితే, కొంత మంది కంపెనీ నిర్ణయంపై బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వెల్లగక్కారు. ఈ క్రమంలో ఉద్యోగులను శాంతింపజేసేందుకు ఓ చిన్న ప్రయత్నం చేసింది మైక్రోసాఫ్ట్. కంపెనీ వేతనం పెంచకపోయినా.. ఉద్యోగులు తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని సూచించారు మైక్రోసాఫ్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ క్రిస్ కాపోస్సేలా.జీతాల పెంపు చేయడం లేదని కంపెనీ తీసుకున్న నిర్ణయంపై నిరాశలో ఉన్న ఉద్యోగులకు ఇటీవలే మైక్రోసాఫ్ట్ సీఎంఓ క్రిస్ కాపోస్సేలా ఓ అంతర్గత లేఖ రాసినట్లు ఫార్చున్ పత్రిక తెలిపింది. అందులో కంపెనీ తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలను వివరించినట్లు తెలిపింది. అయితే, ఉద్యోగులు తమ పరిహారం పెంచుకునే మార్గాన్ని లేఖలో సూచించారని వెల్లడించింది ఫార్చున్ పత్రిక. ఈ వార్తా కథనం ప్రకారం.. కంపెనీ స్టాక్ ధర పెరిగితే ఆటో మేటిక్‌గా మీకు అందే పరిహారం పెరుగుతుందని సీఎంఓ క్రిస్ కాపోస్సేలా లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కంపెనీ స్టాక్ ధర పెరిగేలా పని చేయాలని సూచించారు.

ఈ ఏడాది మెరుగైన త్రైమాసిక ఫలితాలు సాధించినట్లయితే స్టాక్ ధర మంచి స్థాయికి చేరుతుందని తెలిపారు మైక్రోసాఫ్ట్ సీఎంఓ క్రిస్ కాపోస్సేలా. ఇప్పటికే ఈ ఏడాది కంపెనీ షేరు విలువ 33 శాతం పెరిగిందని, దానిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తమందరిపైనా ఉందని లేఖలో సూచించారు. స్టాక్ ధర పెరగడం ద్వారా ఉద్యోగులకు అందే పరిహారం పెరుగుతుందన్నారు.

ఆర్థికంగా చాలా రకాల అస్థిర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది ఉద్యోగులకు జీతాల పెంపు ఉండదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవలే స్వయంగా వెల్లడించారు. అయితే, బోనస్‌లు, స్టాక్ అవార్డులు మాత్రం కొనసాగుతాయన్నారు. ఈ క్రమంలోనే కంపెనీ సీఎంఓ క్రిస్ కాపోస్సేలా స్టాక్ ధర పెంచేలా ఉద్యోగులు కృషి చేయాలని సూచిస్తూ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. మైక్రోసాఫ్ట్ వేలాది మందిని తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఏ సంవత్సరం జనవరిలో 10 వేల మందని తీసివేస్తున్నట్లు ప్రకటించింది.

పెరిగిన బంగారం, వెండి ధరలు

Vodafone: వొడాఫోన్ షాకింగ్ ప్రకటన.. వేలాది మంది ఉద్యోగుల తొలగింపు.. అదే కారణం!Layoffs: ఉద్యోగం పోతుందేమోనని భయంగా ఉందా.. ఈ 6 టిప్స్ ఫాలో అయితే చాలు మీ జాబ్ ఎటూ పోదు!Amazon: అమెజాన్ షాకింగ్ నిర్ణయం.. వందలాది మంది భారతీయులపై వేటు.. కారణం ఇదే!



Source link

Latest news
Related news