LIC Policy: మీరు ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకో మంచి పాలసీ అందుబాటులో ఉది. చాలా తక్కువ ప్రీమియంతోనే భారీ మొత్తంలో రాబడి పొందవచ్చు. దాంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ, ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. దీంతో అనుకోని సంఘటన ఎదురైనప్పుడు మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. కేవలం రోజుకు రూ.45 చెల్లిస్తే చాలు మెచ్యూరిటీ నాటికి మీ చేతికి రూ.25 లక్షలు అందుతాయి. అదే ఎల్ఐసీ అందిస్తున్న జీవన్ ఆనంద్ ప్లాన్. ఇది ఎండోమెంట్ ప్లాన్. ఈ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకోవడం ద్వారా మెచ్యూరిటీ నాటికి ఏకంగా రూ.25 లక్షలు పొందవచ్చు. అందుకు రోజుకు రూ.45 కన్నా తక్కువే కట్టాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.1400 పడుతుంది. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. పాలసీ టర్మ్ 15 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుంది. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకోవచ్చు. దాని ప్రకారమే మీ రాబడి, ప్రీమియం అనేది ఉంటుంది. మెచ్యూరిటీ సమయానికి బేసిక్ సమ్ అష్యూర్డ్, సింపుల్ రివిజనరీ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ వంటివి కలిపి మీకు చెల్లిస్తారు.
మెచ్యూరిటీ ముగిసిన తర్వాత డబ్బులు చెల్లిస్తారు. అయితే బీమా కవరేజీ మాత్రం పాలసీ దారుడు జీవించి ఉన్నంత వరకు వర్తిస్తుంది. ఒక వేళ పాలసీదారుడు మరణిస్తే డెత్ క్లెయిమ్ చెల్లిస్తారు. ఈ నగదు బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు సమంగా ఉంటుంది. ఒక వేళ పాలసీ టర్మ్‌లోనే పాలసీదారుడు మరణిస్తే అప్పుడు డెత్ క్లెయిమ్, బోనస్ అందజేస్తారు. నామినీకి ఈ డబ్బులు వస్తాయి. దీంతో పాటు యాక్సిడెంటల్ డెత్ అండ్ డిస్‌ఎబిలిటీ బెనిఫిట్ రైడర్ కూడా ఉంది. టర్మ్ రైడర్ కూడా తీసుకోవచ్చు.
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ ద్వారా రూ.25 లక్షలు రావాలనుకుంటే మీరు 35 ఏళ్ల టర్మ్ తీసుకోవాలి. ప్రతి ఏడాది రూ.16,300 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు చెల్లించే మొత్తం డిపాజిట్ రూ.5,70,500గా ఉంటుంది. బెసిక్ సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు. మెచ్యూరిటీ పీరియడ్ తర్వాతా రివిజన్ బోనస్ కింద రూ.8.60 ళక్షలు, ఫైనల్ బోనస్ కింద రూ.11.50 లక్షలు మొత్తంగా రూ.25 లక్షలు అందుతాయి. ఏడాదికి రూ. 16 వేలు అంటే నెలకు కేవలం రూ.1358 ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. అంటే రోజుకు రూ.45 కన్నా తక్కువే.
LIC Jeevan Labh: నెలకు ఇంత కడితే మెచ్యూరిటీ కల్లా చేతికి రూ. 54 లక్షలు.. అద్భుత ఆఫర్!
PMJJBY: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? రూ.436 కట్ కాబోతున్నాయ్.. ఎందుకోసమంటే?
SBI: ఎస్‌బీఐ అద్భుత స్కీమ్.. చేరితే ప్రతి నెలా చేతికి డబ్బులు.. పూర్తి వివరాలివే!