మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్-2 ఆడుతుంది. ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సరే తమ జట్టు గెలవాలని ముంబై ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కానీ ఇదేమంత తేలిక కాదు. ఎందుకంటే లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలుపొందలేదు. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా.. మూడుసార్లూ లక్నోనే విజయం వరించింది. ఇరు జట్లు తొలిసారిగా 2022 ఏప్రిల్ 16న బ్రబౌర్న్ స్టేడియంలో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో లక్నో 18 రన్స్ తేడాతో ముంబైని ఓడించింది. ఏప్రిల్ 24న వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైపై లక్నో 36 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ సీజన్లో మే 16న ఏక్నా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. ఆ మ్యాచ్‌లో లక్నో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. ముంబై 5 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో ముంబై విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. గ్రీన్, టిమ్ డేవిడ్ లాంటి హిట్టర్లు క్రీజ్‌లో ఉన్నప్పటికీ.. మోహ్సిన్ ఖాన్ ఐదు పరుగులే ఇచ్చాడు. దీంతో లక్నో గెలుపొందింది.
ప్లేఆఫ్స్ జరగనున్న చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. లక్నో జట్టులో రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్య, అమిత్ మిశ్రా, కరణ్ శర్మ లాంటి స్పిన్నర్లున్నారు. ముంబై జట్టులో పియూష్ చావ్లా మాత్రం ప్రభావం చూపగలిగే స్పిన్నర్. దీంతో లక్నోనే ఫేవరేట్‌గా కనిపిస్తోంది.
చెన్నైది అదే పరిస్థితి..
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌ది కూడా ముంబై తరహా కథే. చెన్నై, గుజరాత్ మూడు మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. ధోనీ సేన ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా గుజరాత్ టైటాన్స్‌పై గెలవలేకపోయింది. ప్లేఆఫ్స్ జరిగేది చెన్నైలో కావడం సీఎస్కేకు ఊరటనిచ్చే అంశం. కానీ ఛేజింగ్‌లో గుజరాత్ ఇప్పటి వరకూ మూడుసార్లు మాత్రమే విఫలమైంది. అందులోనూ చెన్నైతో పోలిస్తే గుజరాత్ జట్టులోనే రషీద్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్ ఉన్నాడు. క్వాలిఫైయర్-1లో ఓడినా.. క్వాలిఫైయర్-2 రూపంలో మరో ఛాన్స్ ఉండటం ఓడిన జట్టుకు ఊరటనివ్వనుంది.