Sunday, June 4, 2023

AP ICET Hall Ticket 2023 : ఏపీ ఐసెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

AP ICET Hall Ticket 2023 : ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే AP ICET-2023 పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. మే 24, 25 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు (షిఫ్ట్‌-1), మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు(షిఫ్ట్‌-2) పరీక్ష జరుగనుంది. ఏపీఐసెట్‌లో ర్యాంకు ద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఏపీలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

AP ICET 2023 హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి

AP ICET 2023 పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు- 55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (2.30 గంటలు).

AP Inter Supplementary Hall Ticket 2023 : ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచినట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాళ్లు వాటిని డౌన్‌లోడ్‌ చేసి, విద్యార్థులకు అందించాలని సూచించారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్‌ 1 వరకు జరగనున్నాయి. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్‌ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు.

AP Inter Supplementary Hall Ticket డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే

India Post GDS : 10వ తరగతి పాసైన వాళ్లకు 12,848 పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక

Latest news
Related news