ఇండియా లైవ్ న్యూస్ అప్డేట్స్..(AP)
Live news today : నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ హెచ్‌టీ తెలుగు పేజ్ని ఫాలో అవ్వండి.
ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు..
స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఇండియన్ బ్యాంక్. ఈ దఫా రిక్రూట్మెంట్లో 18 వేకెన్సీలను భర్తీ చేయనుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఇండియాన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ indianbank.in లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
సరికొత్త మైలురాయిని తాకిన మహీంద్రా థార్!
ఇండియా రోడ్లపై మహీంద్రా థార్ దూసుకెళుతోంది! తాజాగా.. లక్ష సేల్స్ మైలురాయిని తాకింది.
అవినాష్ అరెస్ట్‌పై ఉత్కంఠ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. తల్లకి అనారోగ్యం కారణంగా కర్నూలు ఉన్న అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోడానికి సిబిఐ సిద్ధం అవుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
స్టాక్ మార్కెట్ ఇండియా..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా మొదలుపెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 91 పాయింట్లు కోల్పోయి 61,638 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 18,187 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరు ఓటమి..
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైన బెంగళూరు ఐపీఎల్ నుంచి ఇంటి బాటపట్టింది. గిల్ మెరుపు శతకంతో చెలరేగడంతో బెంగళూరుపై గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లి సెంచరీ వృథాగా మారింది.
తెలంగాణలో వర్షాలు..
ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు ఊరటనిచ్చే కబురును వాతావరణ శాఖ ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం..
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఓ వైపు అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడి పోతున్నారు.మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. డౌ జోన్స్ 0.33శాతం, ఎస్ అండ్ పీ 500 0.14శాతం, నాస్డాక్ 0.24శాతం మేర నష్టాలను చూశాయి. అమెరికాలో డెట్ సీలింగ్ ప్రక్రియ ముందుకు కదలకపోవడం ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి.
ఎస్‌జీఎక్స్ నిఫ్టీ..
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
స్థిరంగా పసిడి వెండి ధరలు..
దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 56,300గా ఉంది. దేశంలో వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,530గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 75,300గా ఉంది.
జీ20 దేశాల సమావేశాలు..
జీ20 దేశాల 3వ టూరింజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నేడు శ్రీనగర్‌లో ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం శ్రీనగర్ ముస్తాబైంది. పటిష్ట భద్రత మధ్య ఈ సమావేశాలు జరగనున్నాయి.