Sunday, June 4, 2023

కళ్లను ఆరోగ్యంగా ఉంచే.. 10 ఆహారాలు ఇవే..!

Food For Eyes: కళ్లు బలహీనంగా మారితే.. దృష్టి మందగిస్తుంది. వయస్సుతో పాటు కంటి చూపు తగ్గడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే కంటి సమస్యలు మొదలువుతున్నాయి. నిశ్చల జీవనశైలి, , మొబైల్-ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా చూడటం, కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా దృష్టి సమస్యలతో భాదపడేవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. కళ్లలో నీరు కారడం, చూపు తగ్గడం, చిన్నవయస్సులోనే కళ్లకు అద్దాలు రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, దృష్టిని మెరుగుపరచుకోవడానికి.. కొన్ని ఆహార పదార్థాలను మన డైట్‌లో చేర్చుకోవాలని డైటీషియన్‌ మన్‌ప్రీత్‌ అన్నారు. మన కంటిచూపను మెరుగుపరచే.. ఆహార పదార్థాలను మనకు షేర్‌ చేశారు.

కంటి ఆరోగ్యం

బాదం, నారింజ..

బాదం, నారింజ..

బాదం కళ్లకు ఎంతో మేలు చేస్తుందని డైటీషియన్‌ మన్‌ప్రీత్‌‌‌‌ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో 5 నానబెట్టిన బాదం గింజలు తీసుకుంటే.. కళ్లకు మేలు జరుగుతుందని అన్నారు. బాదంలో విటమిన్‌ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్‌ తగ్గించి.. కాంతిని పెంచుతాయి. అదే సమయంలో, రోజుకు 1 నారింజ తింటే విటమిన్‌ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. విటమిన్‌ సి కళ్ల దగ్గర రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది దృష్టిని మెరుగుపరుస్తుంది.

Ginger for female health: ఆడవాళ్లు అల్లం తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..?

కళ్ల కోసం యోగ

కళ్ల కోసం యోగ

చిలగడదుంప, క్యారెట్‌..

చిలగడదుంప, క్యారెట్‌..

చిలగడదుంప మన కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుందని డైటీషియన్‌ మన్‌ప్రీత్‌ అన్నారు. చిలగడదుంపలోని బీటా కెరోటీన్‌ ఉంటుంది, ఇది పొడికళ్లు, అంధత్వం నుంచి రక్షిస్తుంది. ప్రతి రోజు సాయంత్రం చిలగడదుంపతో చాట్‌ తయారు చేసుకుని తినండి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్ తప్పనిసరిగా తినాలి. ఇందులో ల్యూటిన్‌, బీటా కెరోటిన్‌ ఉంటాయి. ఇవి కళ్లు దెబ్బతినకుండా రక్షిస్తాయి. మీ కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ప్రతి రోజు క్యారెట్ జ్యూస్‌ తాగండి.

పొద్దుతిరుగుడు గింజలు, మెంతులు..

పొద్దుతిరుగుడు గింజలు, మెంతులు..

ప్రతిరోజు మీరు తీసుకునే సలాడ్, స్మూతీలో 1 టీస్పూన్ పొద్దుతిరుగుడు గింజలను చేర్చుకోండి. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది, ఇది వృద్ధాప్యంలో కూడా కాంతిని బలహీనపరచడానికి అనుమతించదు. అలాగే ప్రతి రోజూ ఉదయం మెంతులు నానబెట్టిన నీరు తాగండి. ఇది కంటి లెన్స్‌ను రక్షిస్తుంది.

పాలకూర, బీట్‌రూట్‌..

పాలకూర, బీట్‌రూట్‌..

పాలకూర కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలకూరలో జియాక్సంతిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది వయస్సు కారణంగా కాంతి బలహీనపడకుండా చేస్తుంది. పాలకూర మీ డైట్‌లో తరచుగా చేర్చుకుంటే కంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే మీ డైట్‌లో బీట్‌రూట్‌ చేర్చుకుంటే.. కళ్లకు మేలు జరుగుతుంది. బీట్‌రూట్‌లోని లుటిన్‌, కంటి రక్త ప్రసరణను పెంచుతుంది.

బఠానీల, వేరుశనగ..

బఠానీల, వేరుశనగ..

బఠానీలు కంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. కంటిశుక్లాలు రాకుండా బఠానీలలోని పోషకాలు నివారిస్తాయి. అదేవిధంగా.. వేరుశెనగలోని విటమిన్‌ ఇ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

jungle jalebi: సీమ చింత.. కొలెస్ట్రాల్‌ కరిగించడమే కాదు, క్యాన్సర్‌కు చెక్‌ పెడుతుంది..!

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news