కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవాటికెట్లను 21వ తేదీన విడుదల చేస్తారు. శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23వ తేదీన విడుదలవుతాయి. అదేవిధంగా రూ.300 దర్శన టికెట్ల కోటాను 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఇక నుంచి దర్శనం, ఆర్జితసేవలు, గదుల కోటాను ఆన్‌లైన్‌లో ఒక షెడ్యూల్ ప్రకారం విడుదల టీటీడీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది.
BREAKING NEWS