IPL 2023: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. లివింగ్‌స్టన్ విధ్వంసంతో చివరి బంతి వరకూ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. 48 బంతుల్లోనే అతడు 94 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. అద్భుతంగా ఆడి ఢిల్లీని గెలిపించిన రొసోవ్ (82 రన్స్, నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
BREAKING NEWS