Sunday, June 4, 2023

fd interest rates, Axis Bank: కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. ఈ బ్యాంక్ షాకింగ్ ప్రకటన.. ఎవరిపై ప్రభావం పడనుందంటే? – axis bank reduces fd interest rate by 20 bps on this tenor check details


Axis Bank: ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటి. ఇప్పుడు ఆశ్చర్యకరంగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. చాలా బ్యాంకులు FD లపై వడ్డీ రేట్లను పెంచడం లేదా మార్చకుండా ఉంచడం చేస్తుంటే మరోవైపు యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్ రేట్లను తగ్గించడం గమనార్హం. 5 నుంచి 30 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించింది. 2023 మే 18 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ సవరణల తర్వాత యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుంచి పదేళ్ల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు మొత్తం యాక్సిస్ బ్యాంకులో ఏయే కాలపరిమితులపై ఏయే విధంగా వడ్డీ రేట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రస్తుతం యాక్సిస్ బ్యాంకులో FD వడ్డీ రేట్లు 7 నుంచి 45 రోజుల వ్యవధి ఉంటే 3.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక 46 నుంచి 60 రోజుల వ్యవధి ఉంటే 4 శాతం వడ్డీ వస్తుంది. 61 రోజుల నుంచి 3 నెలల వరకు.. 3 నెలల నుంచి 6 నెలల వరకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు వరుసగా 4.50 శాతం, 4.75 శాతంగా ఉన్నాయి. ఇక 6 నుంచి 9 నెలల వరకు ఉన్న FD లపై 5.75 శాతం, అదే 9 నెలల నుంచి ఏడాది లోపు వ్యవధి ఉన్న డిపాజిట్లపై 6 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది.

అదానీ హిండెన్‌బర్గ్ వివాదం ఇప్పట్లో తేలేలా లేదుగా.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం!

ఏడాది నుంచి ఏడాది 4 రోజుల వ్యవధి ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గగా.. ఇప్పుడు 6.75 శాతానికి చేరింది. ఏడాది 5 రోజుల నుంచి 13 నెల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 30 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గించగా 7.10 శాతం నుంచి 6.80 శాతానికి దిగొచ్చింది. ఇక రెండేళ్ల నుంచి 30 నెలల లోపు వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.20 శాతం నుంచి 7.05 శాతానికి తగ్గించడం గమనార్హం. మిగతా కాలవ్యవధులపై మాత్రం 7 శాతం వడ్డీ రేటు అలాగే ఉంది.

ఇక వడ్డీ రేట్లను సవరించిన తర్వాత సీనియర్ సిటిజెన్లు 7 రోజుల నుంచి పది సంవత్సరాల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.85 శాతం మేర వడ్డీ అందుకోనున్నారు. రూ. 2 కోట్ల లోబడి చేసే డిపాజిట్లపై 13 నుంచి 14 నెలల వ్యవధి ఉన్న డిపాజిట్లు, 14 నుంచి 15 నెలలు, 15 నుంచి 16 నెలలు, 16 నుంచి 17 నెలలు, 17 నుంచి 18 నెలలు, 18 నెలల నుంచి రెండేళ్ల వ్యవధి ఉన్న FD లపై వడ్డీ రేటు గరిష్టంగా 7.85 శాతంగా ఉంది.

దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

శుభవార్త.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఎక్కడెక్కడ రేట్లు ఎలా ఉన్నాయంటే?



Source link

Latest news
Related news