Assam gang rape: తెలిసిన వాళ్లే కదా అని..
13 ఏళ్ల బాలిక పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను కోక్రాగఢ్ ఎస్పీ పుష్ఫరాజ్ సింగ్ తెలిపారు. నిందితుల్లో ఒక వ్యక్తి పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో ఆ బాలిక వారి కార్లో వెళ్లింది. కారు కొంత దూరం వెళ్లిన తరువాత కారులోనే నిందితులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపిస్తున్న కారును ఆపి నిందితులను అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆ బాలికను విచారించగా, నిందితుల్లో ఒక వ్యక్తి తనకు తెలుసని వెల్లడించింది. అలాగే, కారులో ఉన్న అందరూ తనపై అత్యాచారం చేయలేదని వెల్లడించింది. అనంతరం ఆ బాలికను వైద్య పరీక్షల కోసం దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆ బాలికకు కౌన్సెలింగ్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై పొక్సొ (Protection Of Children from Sexual Offences Act POCSO) చట్టం తో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. బాధిత బాలిక వివరాలను, నిందితుల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని స్థానిక నెటిజన్లకు పోలీసులు సూచించారు.