Saturday, June 3, 2023

TS POLYCET Hall Ticket 2023 : తెలంగాణ పాలిసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌కు డైరెక్ట్‌ లింక్‌ ఇదే

TS POLYCET Hall Ticket 2023 : తెలంగాణ పాలిసెట్‌ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికిగానూ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు TS POLYCET-2023 పరీక్ష బుధవారం (మే 17న) జరుగనున్న విషయం తెలిసిందే. మొత్తం 296 పరీక్ష కేంద్రాల్లో ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల వ‌ర‌కు ప్రవేశ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. మొత్తంగా 1,05,656 మంది ఈ ప‌రీక్షకు హాజ‌రు దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తు చేసుకున్న వారిలో అబ్బాయిలు 58,468 మంది, అమ్మాయిలు 47,188 మంది ఉన్నారు. వీళ్లు హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ https://polycet.sbtet.telangana.gov.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ప్రవేశ ప‌రీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్యవ‌సాయ‌, ఉద్యాన‌వ‌న, వెట‌ర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తారు.

ఇవి తప్పనిసరి :
TS POLYCET 2023 ఎంట్రెన్స్ టెస్టుకు హాజ‌ర‌య్యే విద్యార్థులు ఒక గంట ముందుగానే ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల‌ని.. నిమిషం ఆల‌స్యమైనా ప‌రీక్షా కేంద్రంలోకి అనుమ‌తించబోమని పరీక్ష కన్వీనర్‌ డాక్టర్‌ సి శ్రీనాథ్‌ స్పష్టం చేశారు. విద్యార్థులు త‌మ హాల్ టికెట్‌తోపాటు ఒక పాస్‌పోర్టు సైజు ఫోటోను వెంట తీసుకువెళ్లాలని సూచించారు. వెంట హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ పెన్, రబ్బర్‌ మాత్రమే తీసుకువెళ్లాలని.. ఎలక్ట్రిక్‌ వస్తువులను లోపలికి అనుమతించమని పేర్కొన్నారు.

TS POLYCET Hall Ticket డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి

Latest news
Related news