ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక ట్వీట్ చేశారు. ‘పాపం పసివాడు’ సినిమా పోస్టర్‌ను ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్.. ఈ సినిమాను ఎవరైనా ఏపీ సీఎంతో తీస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘మన ఏపీ సీఎంతో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన చాలా అమాయకుడు, కల్లాకటపం లేని వ్యక్తి. ఇక్కడ ఒక చిన్న మార్పు అవసరం.. ఆయన చేతిలో ఉన్న ఒక్క సూట్‌కేస్ బదులుగా ఆయన అక్రమ సంపాదన కోసం మనీ లాండరింగ్‌ను సులభతరం చేసే బహుళ ‘సూట్‌కేస్ కంపెనీల’ను ఉంచాలి. డియర్ ఏపీ సీఎం.. మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కాదు, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి కాదు. అక్రమ సంపాదనను పోగేసి, ప్రజలను హింస పెట్టే మీకు క్లాస్ వార్ (వర్గ సంఘర్షణ) అనే పదాన్ని పలికే హక్కు లేదు. మీ నుంచి, మీ గ్రూప్ నుంచి ఏదో ఒకరోజు రాయలసీమ విముక్తి పొందుతుందని ఆశిస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అంతేకాదు, ఈ కథకు రాజస్థాన్ ఎడారిలోని ఇసుక తిన్నెలు అవసరమని.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని నదుల నుంచి వైసీపీ లూటీ చేసిన ఇసుక తిన్నెలు జగన్‌తో చిత్రీకరించడానికి సరిపోతాయని సెటైర్ వేశారు. నిజాంపట్నం బహిరంగ సభలో తనపై సీఎం జగన్ చేసిన విమర్శలను తిప్పికొడుతూ పవన్ కళ్యాణ్ ఈ సెటైరికల్ ట్వీట్ చేశారు.
అయితే, ఈ ట్వీట్‌కు రాంగోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. అచ్చం పవన్ కళ్యాణ్ రాసిన ట్వీట్ మాదిరిగానే ట్వీట్ చేసి కౌంటర్ ఎటాక్ చేశారు. ‘మీతో కూడా ఈ సినిమాను ఎవరైనా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు అజ్ఞానంతో నిండిన అమాయకుడు, అమాయకత్వం నిండిన కల్లాకటపం లేని వ్యక్తి. ఒకేఒక్క మార్పు ఇక్కడ అవసరం: ఒక పాత్రను పోషించే బదులు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌ను కలిగి ఉన్న బహుళ పాత్రలను పోషించండి. సీఎం కావాలని కోరుకోని ప్రియమైన పవన్ కళ్యాణ్.. మీరు ఎన్టీఆర్ రామారావు కాదు, ఎంజీఆర్ కాదు. మీ అవాగాహనాలేమి, మీ అభిమానులపై మీరు ప్రేరేపించే హింస కారణంగా మీకు ‘ప్రజాసేవ’ అనే పదాన్ని పలికే అర్హతే లేదు. ఏదో ఒక రోజు మీ నుంచి, మీ సైకోపాతిక్ నార్సిజం నుంచి మీ జనసైనికులు విముక్తి పొందుతారని ఆశిస్తున్నాను’ అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ మాదిరిగానే ఆఖరిలో గమనిక కూడా ఇచ్చారు. ‘ఈ స్టోరీకి రాజస్థాన్ ఎడారిలోని ఇసుక తిన్నెలు అవసరం. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసత్యాలు చెప్పి వారిని నమ్మించడానికి మీకు హైదరాబాద్ కావాలి. ఎందుకంటే, కొన్ని థియేటర్ కలెక్షన్ పాయింట్స్ వద్ద మీకు కొంత మంది అమాయక అనుచరులు ఉన్నారు కాబట్టి. చీర్స్’ అని వర్మ కౌంటర్ ఇచ్చారు. వర్మ ట్వీట్‌కు రెండు రకాల కామెంట్లు వస్తున్నాయి. వైసీపీ సానుభూతిపరులు వర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. జనసైనికులు మాత్రం తిట్టిపోస్తున్నారు. వైసీపీ పేటీఎం కుక్క అని ఘాటుగా తిడుతున్నారు.