Sunday, June 4, 2023

bank of baroda, FD Rates: శుభవార్త.. వడ్డీ రేట్లు పెంచిన దిగ్గజ బ్యాంక్.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐతో పోలిస్తే అధిక లాభం! – bank of baroda hikes fixed deposit fd interest rates


FD Rates: బ్యాంక్ ఆఫ్ బరోడా .. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఎంపిక చేసిన కాలవ్యవధులపై 30 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. రూ. 2 కోట్లకు లోబడిన డిపాజిట్లపై ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇక ఈ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం 2023, మే 12 నుంచి అమల్లోకి వచ్చింది. బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీంపైనా వడ్డీ రేట్లు పెరిగాయి. ఇప్పుడు 399 డే బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీంపై వార్షికంగా 7.90 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇక ఇందులో సీనియర్ సిటిజెన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల మేర అంటే 0.50 శాతం ఎక్కువగా ఉంటుంది. నాన్ కాలబుల్ డిపాజిట్లపై 0.15 శాతం అదనంగా ఉంది. ఇక వడ్డీ రేట్లను పెంచిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్లపై వడ్డీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.ఇక వేర్వేరు కాలవ్యవధులపై సాధారణ ప్రజలకు 3 నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజెన్లకు 3.5 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ ఇస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. దీనిని ఎస్‌బీఐతో పోల్చితే ఎలా ఉందో చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7 రోజుల నుంచి పదేళ్ల వరకు వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.1 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఇది సాధారణ కస్టమర్లకు కాగా.. సీనియర్ సిటిజెన్లకు ఇక్కడ కూడా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ అదనంగా లభిస్తుంది. ఇక ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధి ఉన్న SBI డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. 2023 ఫిబ్రవరి 15 నుంచి ఈ వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి.

iPhone Manufacturing: ఐఫోన్ల తయారీని ప్రారంభించిన టాటాలు.. సరికొత్త చరిత్ర.. ఇక చైనాకు చుక్కలే!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనూ 7 రోజుల నుంచి పదేళ్ల వ్యవధి ఉన్న డిపాజిట్లపై .. మంచి వడ్డీ వస్తోంది. ఇక్కడ కూడా 3 శాతం నుంచి 7.1 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజెన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్ల మేర లాభం పొందనున్నారు. ఫిబ్రవరి 21 నుంచి ఈ వడ్డీ రేట్లు అమలవుతున్నాయి.

నేటి బంగారం వెండి ధరలు ఇవే..

ఇదే విధంగా ప్రైవేట్ రంగానికి చెందిన మరో దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐలో కూడా వడ్డీ రేట్లు పై బ్యాంకుల మాదిరిగానే ఉన్నాయి. ఇక్కడ 7 రోజుల నుంచి పదేళ్ల వ్యవధి ఉండే డిపాజిట్లపై సాధారణ కస్టమర్లు 3 శాతం నుంచి 7.10 శాతం వరకు ఉండగా.. సీనియర్ సిటిజెన్లు 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీ అందుకోనున్నారు. 2023, ఫిబ్రవరి 24 నుంచి ఈ వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి.

Bank FDs: శుభవార్త.. మే నెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు ఇవే.. వీటిల్లో డబ్బులు దాచుకుంటే ఎక్కువ లాభం!



Source link

Latest news
Related news