AP TS Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచి ఉక్కపోతతో జనం ఉడికిపోతున్నారు. రోడ్లపైకి రావాలంటే భయపడిపోతున్నారు. గత రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోయాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడా అనే రీతిలో ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉక్కపోత, వడగాల్పులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బకు ఆంధ్రప్రదేశ్ లో నలుగురు, తెలంగాణలో ముగ్గురు మృతి చెందారు. మంగళవారం హైదరాబాద్, రాజమండ్రిల్లో రికార్డుస్థాయిలో 49 డిగ్రీలు, ఏలూరులో 48, కొత్తగూడెం, మిర్యాలగూడలో 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజులు ఇదే తీవ్రస్థాయిలో ఎండలు, వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
BREAKING NEWS