ఇది హత్యే: రభా తల్లి ఆరోపణ
Junmoni Rabha: జున్మోనీ రభా మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ విషయంపై పోలీసులు నిష్పాక్షికంగా విచారణ జరిపి, నిజాన్ని బయటికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇది ప్రీ-ప్లాన్డ్ మర్డర్ అని జున్మోనీ తల్లి సుమిత్ర రభా.. మీడియాతో అన్నారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించారని, ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కోరారు జున్మోనీ బంధువు సువర్ణ. సోమవారం జరిపిన సోదాల్లో జర్మోనీ అధికారి క్వార్టర్‌లో రూ.1లక్షను అధికారులు సీజ్ చేశారని, ఆ డబ్బు ఆమె తల్లిది అని ఆమె తెలిపారు.