New Parliament building: భవనం విశేషాలు..
కొత్త పార్లమెంటు భవనం (New Parliament building) 65 వేల చదరపు మీటర్ల వైశాల్యంతో రూపొందింది. ఇందులో లోక్ సభ (LOK SABHA), రాజ్యసభ (RAJYA SABHA) కార్యకలాపాల కోసం రెండు పెద్ద హాల్స్ ను నిర్మించారు. అలాగే, ఒక పెద్ద లైబ్రరీని, అత్యాధునిక కాన్స్టిట్యూషన్ హాల్ ను ఏర్పాటు చేశారు. చట్టసభల సభ్యుల కోసం ప్రత్యేక గదులు, పార్లమెంటు కమిటీల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. లోక్ సభ కార్యకలాపాల కోసం రూపొందించిన భారీ హాల్లో కనీసం 888 మంది ఎంపీలు కూర్చునే వీలుంది.అలాగే రాజ్యసభ హాళ్లో కనీసం 384 మంది సభ్యులు కూర్చోవచ్చు. లోక్ సభ హాల్ ను నెమలి (PEACOCK) ఆకృతిలో, రాజ్యసభ హాల్ ను కమలం పువ్వు (LOTUS) ఆకృతిలో రూపొందించారు.