Karnataka CM Suspense: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీలో ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులు అవుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎటూతేల్చకపోవటంతో టెన్షన్ నెలకొంది. అయితే, కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపికపై హస్తం పార్టీ నేడు (మే 17) నిర్ణయం తీసుకుంటుందని అంచనాలు ఉన్నాయి. సీనియర్ లీడర్లు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో భేటీ కానున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మరోసారి వారు కలిసే అవకాశం ఉంది. నేటి మధ్యాహ్నం ఒంటి గంట లేకపోతే సాయంత్రంలోగా కర్ణాటక సీఎంపై కాంగ్రెస్ అధిష్టానం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలుస్తోంది.